బహు సంతానవృద్ధి!
"ఆయన తన ప్రజలను బహు సంతానవృద్ధి కలుగజేసెను వారి విరోధులకంటె వారికి అధికబలము దయచేసెను. " (కీర్త. 105: 24).
యెహోవా మిమ్మును విస్తరింపచేయువాడు,బలపరచువాడు, శత్రువులకన్నా మిమ్మును అధిక శక్తివంతులై ఉండాలనే ఆయన ప్రేమయు చిత్తమునైయున్నది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శత్రువులు వ్యాపించి ఉన్నారు. ఎదిరించుట,పోరాటమును ప్రతిచోటా ఉన్నాయి. అయితే, దేవుని పిల్లలైన మీరు కలవరపడవద్దు. 'శత్రువులకన్నా మిమ్మును బలవంతులను చేస్తానని'యెహోవా వాగ్దానం చేశాడు. కాబట్టి బలము కలిగి దైర్యముగా ఉండుడి.
దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను "నీవు దైర్యము తెచ్చుకొని నిబ్బరము గలిగి." (1 రాజు. 2: 2).
అవునుగాక. ఆలాగే సొలొమోను ఇశ్రాయేలుపై తన రాజ్యాన్ని చేసి విస్తరించెను, బలముతో శత్రువులందరు అతనికి ముందు లొంగిపోయారు. అవును దేవుని వాగ్దానికి నమ్మదగినవాడు.
అజరియా ఇశ్రాయేలు ప్రజలను చూచి, "కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి,మీ కార్యము సఫలమగును. " (2 దినవృత్తాంతములు 15: 7). ఆవిధముగా ఇశ్రాయేలీయులు బలపడిరి. శత్రువులు ఓడించారు. గ్రంథం ఇలా చెబుతోంది: "యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్దములు లేకుండ వారికి నిమ్మది కలుగజేసెను." (2 దినవృత్తాంతములు 15:15).
యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను కానానులోకి నడిపించికొని వచ్చినప్పుడు, అక్కడ ఏడు శక్తివంతమైన జాతులు ఉన్నాయి. ముప్పై ఒక్క రాజులు పరిపాలించారు. ఇశ్రాయేలీయులయొద్ద, సరిపడె ఆయుధాలు యుద్ధ కవచములులేవు. కాని యెహోవా వారి శత్రువులకన్నా వారిని బలవంతులనుగా చేశాడు.
యెహోవా యెహోషువను చాలా బలపరచి, "నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును;నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము.వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగ నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు (యోహోషువా 1:5,6) అని చెప్పారు.
ఆ దేవుడు మీ దేవుడైయున్నాడు. ఈ రోజు మీ చుట్టు శత్రువులు లేచియుండవచ్చు. మీ పొరుగువారు మీపై అసూయపడి, అనేక విధాలుగా మిమ్మల్ని కష్టపెట్టియుండవచ్చు. మీ బందువులే మీకు విరోధముగా మాటలాడి ఉండవచ్చు. అయినను మీరు సోలీపోకండి. ఈ రోజు ప్రభువు తన ప్రేమచేయి మీపై పెట్టి, 'భయపడకు,నేను నీకు తోడు నిలిచెదను. శత్రువులకన్నా నేను మిమ్మును బలవంతుడనిగా చేస్తాను. అని చెప్పాడు.
గుర్తుంచుకో: - "సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు పప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. (యెష. 35: 3,4).