ఔషధం!
"సంతోషముగల మనస్సు ఆరోగ్య కారణము.నలిగిన మనస్సు ఎముకలను, ఎండిపోజేయును." (సామెతలు 17:22).
"ఔషధం" అనే పదానికి అర్థం ఏమిటి? ఔషాధం అనేది మంచిమందు. అది దైవీకమైన ఆరోగ్యాన్ని ఇచ్చే పానం.
ఇది అన్ని వ్యాదులను తొలగించి ఆరోగ్యాన్ని తీసుకు వస్తుంది.
మందుల షాపులో పలు విదాల మందులను చూడవచ్చు. కానీ దేవుని పిల్లల కొరకు దేవుడు ఇచ్చే ఒక విశేష ఔషధం సంతోష హృదయమే.(సామె 17:22). సంతోషహృదయము కలిగిన వాడు నవ్వు ముఖంతో ఉంటాడు. అతని ముఖము కలగా కనిపిస్తుంది. నవ్వు ముఖముతో ఉన్నవారిని అందరు ఇష్టపడతారు.
మీకు ఎప్పుడు సంతోష మనస్సు ఉంటుంది? క్రీస్తు మీ హృదయంలోకి వచ్చి నప్పుడు, ఆయన మహిమ మిమ్మును ప్రకాశింపజేసినప్పుడు సంతోష హృదయం వస్తుంతుంది. ఇందువలన మీరు మీ పాపాలను గురించి తలచి దిగు లుపడడంలేదు. దానిని దేవునిపై పెట్టి ఆయనను పొగడుతు ప్రస్తాపిస్తున్నారు. లేఖనం చెబుతుంది: "యోహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. " (కీర్తన 37: 4).
దేవుని పిల్లలారా, కుటుంబంలో భార్య పిల్లలతో సంతోషంగాఉండే సమయంను కేటాయించండి. అది ఒక మంచి ఔషధం. కుటుంబంలో సంతోషంగా ఉంటే, బయ టున్న సమస్యలను పూర్ణబలముతో ఎదిరించి నిలబడటానికి అది సహాయ పడుతుంది. శత్రువు మిమ్మును గెలవలేడు.
మరియొక మంచి మాటలను ఔషధం అని గ్రంథం గుర్తిస్తుంది. "కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము." (సామె.12:18). మంచి మాటలను మీరు మాట్లాడం ఇతరులకు ఆరోగ్యాన్ని, ఉత్సాహామును ఇస్తుంది. ఒకే నాలుక ఇతరులను నిరుత్సాహపరిచే మాటలను,
ఉత్సాహపరచే మాటలను మాట్లాడు తుంది.ఉత్సాహపరచి మాట్లాడేటప్పుడు, అది శక్తివంతమైన ఔషధంగా వెలిపడుతుంది.
విల్లియం కోల్గేట్ అనే చిన్నవాడు ఒకడు ఉన్నాడు.అతను పేదరికంలోను, ఆకలితో కష్టపడి జీవనోపాధి వెదకి పట్టణానికి వచ్చాడు. అక్కడ దేవుని సేవకుడు ఒకరు అతన్ని కలిశాడు. అతని ఉత్సాహపరచి “కుమారుడా ఒక రోజు వస్తుంది, అప్పుడు నీవు చాలా హెచ్చింపబడుదువు. నీవు ఏ వ్యాపారం చేసినా ప్రజలకు ఉత్తమమైనది ఇయ్యుము.అప్పుడు దేవుడు నీకు ఉత్తమమైనదాన్ని ఇస్తాడు' అన్నారు. ఆ మాటలు ఆ చిన్నవాడిని చాలా ఉత్సాహ పరచాయి. ఆ మాటలు ఆ అబ్బాయికి గొప్ప ఔషధంగా మారింది. తరువాత సంవత్సరంల్లో ఆ బాలుడు కోల్గేట్ అనే పెద్ద నిర్వహమునకు యజమానుడుగా మారాడు.
లేఖనం చెబుతుంది: "సరిగా ప్రత్యుత్త రమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము! (సామె.15:23). ఔషధమైన మాటలను మాట్లడ పోతున్నారా, లేదా విషపూరితమైన మాటలను మాట్లాడపోతున్నారా, అనేది మీరు మాటలాడే ముందుగా కొంచెం ఆలోచించండి. దేవునిపిల్లలారా, మీ నోటి నుండి వచ్చే మాటలు మంచి మంచి ఔషధంగా ఉండనివ్వండి.
ధ్యానం చేయడానికి: “ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి. (సామెతలు 16:24).