తన గూడు విడచి!

" తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు." (సామెతలు 27: 8).

సొలొమోను జ్ఞాని గూడువిడచి తిరుగు తున్న ఒక పక్షిని చూసాడు. గూడులో ఉన్నప్పుడు దానికి ఎంతో ఆధరణ,వసతి, విశ్రాంతి ఉన్నది. కానీ గూడు లేక తిరిగేట ప్పుడు వర్షం, గాలి దానికి ఇబ్బంది పెట్ట టానికి, అది విలపిస్తుంది. తరువాత,జ్ఞాని తన స్థానాని విడచి తిరుగుతున్న వ్యక్తిని చూసాడు. తన స్థలం నుండి పడుతున్న ఆ మనిషియొక్క పరితాప పరిస్థితిని గూర్చి చింతించి విలపిస్తున్నాడు.

ఒక వ్యక్తి రైల్వేలో పెద్ద అధికారిగా యున్నాడు. అతనికి పెద్ద ఇల్లు, సౌకర్య మైన జీవితము,అన్ని ఉన్నవి. కాని అతని యొక్క యెవ్వన కుమారుడు తరచుగా ఇంటి నుండి బయటికీ పారిపోతాడు. కొన్ని నెలల తరువాత అతని చూస్తే పరి తాముగా రైల్వే ప్లాట్‌ఫామ్‌లలో నిద్రిస్తూ, తలపై బరువు మోస్తు దానిలో వస్తున్న కొంచెం పైసలు పెట్టి ఆకలి దప్పులతో తన రోజులను గడుపుకొంటున్నాడు. తల్లి దండ్రులు పోయి అతన్ని పిలుచుకొని వస్తారు.

అదే విధంగా,దేవుడు ఒక మనిషిని ఒక స్థానంలో ఉంచుతాడు. అతనికి రక్షణ సంతోషమును, పరిశుద్దుల ఐక్యతను, ఇచ్చి ఆశీర్వదిస్తాడు. అతనికి సహాయ ముగా ఉండడానికి పరలోకపు దేవదూత లకు ఆజ్ఞనిస్తున్నాడు. నిత్య నివాసము లను ఏర్పచి అతన్ని ప్రసిద్ధిచేస్తాడు.కానీ అతనో, రాజుగా అభిషేకం చేసిన దేవుని విడచి,పాప మార్గంలోకి ప్రవేశించి కోపాగ్ని కుమారుడుగా పాతాళమును, అగ్ని సముద్రము వైపు వెళ్లుతున్నాడు.

ఆదిలో, దూతలలో ప్రాత కాల కుమారుడైన వేకువచుక్కను దేవుడు ప్రసిద్ధిపరచి ఉంచ్చాడు. అతను ప్రధాన కెరూబుగా ఎన్నుకొన్నబడాడు. కానీ దేవుడు ఉంచిన ఉన్నత స్థానములో అతను నిలబడక "నేను ఆకాశమున కెక్కిపోయెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసన మును హెచ్చింతును;ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును. ”(యెషయా 14:13). అని చెప్పి, దేవునికి సమముగా తనను ఎంచుకొన్నాడు. ఇందువలన అతను తన స్థాన్నాని కోల్పోయి విశ్రాoతిలేనివాడాయెను. ఈ రోజు, సాతానుగా అంధకారపు లోకాధి పదిగా తిరుగుతున్నాడు.

దేవుడు మిమ్మును ఉన్నత స్థాయిలో ఉంచాడు. అతను మిమ్మల్ని ఉంచిన స్థానములో మీరు నిలకడగాఉండుడి. పాప ఆకర్షణలు, లోకాషలకు మైమరచి పడకుండా జాగ్రత్త ఉండుడి. మీరు మహో న్నతుని దేవుని పిల్లలైయున్నారు. ఆయనను 'అబ్బా, తండ్రీ' అని పిలిచేట టువంటి దత్తపుత్రాత్మను పొందియు న్నారు. మాత్రమేకాక దేవుడు మిమ్మల్ని రాజులుగాను, యాజకులుగాను అభిషే కించాడు. నిత్యములో మేలైన స్వాతం త్రమును మీకు ఉంచాడు. దాని కాపా డుకొండి. దేవుని పిల్లలారా, దేవుని ప్రేమను, ఆయన కృపను విడచి తొలగి, గూడు విడచి తిరుగుతున్న పక్షిలా ఉండకండి.

ధ్యానం చేయడానికి: “మనోహార స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్ఠమైన స్వాస్త్యము నాకు కలిగెను. ”(కీర్తన 16: 6).