బలహీనంగా వెళ్ళు!
" వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను" (కీర్త. 105: 37).
ఇశ్రాయేలు జనులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. కటినమైన పనులతోను, ఘోరమైన పురుషుల అదికారముతో బాధపడుతున్నారు. అయితే ప్రభువో, వారి మాన కష్టని చూసి వారిని ఐగుప్తు బానిసత్వం నుండి బయలుదేరచేసి, కానానులోకి నడిపించుకొచ్ఛాడు. గ్రంథం చెబుతుంది.
" వారిలో బలహీలు ఒకరును ఉండియుండలేదు". మీరు బలవంతులుగా బయలుపడవలెను అని ప్రభువు ఇష్టపడుతున్నాడు. మీరు ఏ విధంగానైనా బలహీనంగా ఉండటం ప్రభువునకు ఇష్టమైనదికాదు, చిత్తమునుకాదు. ఆ రోజు ఇశ్రాయేలు జనులను బలమైన వారిగా కాపాడినవాడు పక్షపాతికాడు.ఈ రోజు మిమ్మల్ని బలవంతులుగాను, దైర్యవంతు లుగాను కాపాడటానికి ప్రభువు బలవంతుడైయున్నాడు.
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్ధించుచున్నాను. (3 యోహాను 2). అనేదే ప్రభువు చిత్తమును ప్రియమునై యున్నది. మీరు దేవుని వైపు చూడండి ఆయన ఎంత బలముగలవాడు! శక్తిమంతుడు! మీరును బలముగలవారుగా, దైర్య ముగాలవారుగా, శక్తివంతులుగా బయలు పడాలని మీ పరమ తండ్రి ఇష్టపడుచున్నాడు. మీరు బలవంతుని కుమారులు కదా?
" యెవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతునిచేతిలోని బాణములవంటివారు" (కీర్త. 127: 4) అని గ్రంథం చెబుతోంది.
దేవుని పిల్లలారా, బలహీనతలను ఎదిరించండి. బలహీనత మిమ్మల్ని సందించునపుడు, "నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను." (ఫిలిప్పీయులకు 4:13). అని మరల మరల చెప్పుడి. అప్పుడు మీ , ఆత్మ మరియు శరీరం బలపడును.
లోకస్థులు తమ యొక్క శరీరాలను బలపరచడానికి ప్రపంచం వందలాది మార్గాలతో వ్యవహరిస్తోంది. అయితే ఆత్మను బలపచే మార్గం వారికి గ్రహించకున్నారు. మీరు బలపడి, ధైర్యము గలిగి ఉంటేనే ప్రభువు కోసం గొప్ప కార్యములు చేయగలరు.
ఒక వేలా మీరు 'నేను బలహీనుడనై పోతిని, వ్యాధి నన్ను వాదించ్చుచున్నది, నేను ఏలా బలపడగాలను' అని అడగవచ్చు. మొదట, మీ యొక్క బలహీనతలను, వ్యాధులను ప్రభువుపై ఉంచండి. అతను దానిని ఇప్పటికే సిలువపై పరిష్కరించాడు.గ్రంధం చెబుతోంది: "ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని " (మత్తయి 8:17). "అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది."(యెషయా 53: 5).
దేవుని పిల్లలారా, మీయొక్క అన్ని సమస్యలను ప్రభువుపై ఉంచి, తరువాత బలపరచె క్రీస్తు వైపు చూసి, మీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతోను స్తుతించుదురుగాక. అప్పుడు ప్రభువు మిమ్మల్ని బలపరుస్తాడు.
రిమైండర్: - " మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను. (ఎఫె. 3: 16,19).