తప్పిపోయిన గొఱ్ఱవలె !
“తప్పిపోయిన గొఱ్ఱవలె నేను త్రోవవిడచి తిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ”( కీర్తన 119: 176 ).
ఒకసారి ఒక సహోదరుని నాకు పరిచయం చేసేటప్పుడు." ఆయన గూడు విడచి గూడు తిరుగువాడు అని అన్నారు." నేను ఆ మాటను విక్రమాదిత్య కథలలోనే చదివాను. ఆ ఉపాయాలు నేర్చుకున్న సాధారణ మనిషి అయినప్పటికీ, అతను దగ్గరలో ఒక జింక చనిపోయివుంటె. ఈ ఆత్మ ఆ జింకలో ప్రవేశించి జింక సజీవంగా వెలిపోతుంది. ఒక పంది చనిపోయివుంటె ఈ ఆత్మ ఆ పందిలోకి దూరి పంది రూపం పొంది వేళ్లుతుంది. అదే గూడు విడచి గూడు మారటం అని అంటారు.
కానీ ఆ సహోదరునికి ఆ పేరు రావటానికి కారణం తెలుసా? ఆయన కొంతమంది దగ్గర సహాయం,సిఫారసులను పొంది ఉన్నత స్థాయిలో కూర్చుoటాడు. కానీ అతనికి వచ్చే ముంకోపము నిమిత్తము ఓకే వారంలో ఆ ఉద్యోగం పోగొట్టుకొనే పరస్థితి ఏర్పడుతుంది. మళ్లీ వేరు ఉద్యోగంలోకి పోయి చేరుతాడు. దానిలోను ఒక్క వారమే. ముంకోపముతో మంచి మంచి ఉద్యోగాలను పోగొట్టుకొని, చివరకు ఎవ్వరు ఆయనను చేర్చుకోక మిక్కిలి మోసమైన పరస్థితికి వచ్చాడు. అతని కుటుంబం ఆకలి బాదతో తపించింది! ఇది ఎంతటి దారుణమైన పరిస్థితి!
ఆధ్యాత్మిక జీవితంలో కూడా, మీ మనస్సు అటు ఇటు తిరుగుతు ఉంటె, కదిలితే, దేవుడు మిమ్మును ఉంచిన ఉన్నత స్థాయిలో నిలకడగా ఉండలేక. సాతాను ద్వారా మోసపోయి ధీనస్థితిలోకి దిగజారిపోతారు.
ఇశ్రాయేలుకు మొదటి రాజైన సౌలు జీవితాన్ని చూడండి! గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళిన అతని దేవుడు ఏర్పరచుకొన్నాడు. ఇశ్రాయేలు రాజుగా అభిషేకించ్ఛాడు. కానీ అతను ఏమి చేశాడు? దేవుని మాటకు చెవియొగ్గక, అమలేకీయుల పశువుల వైపు వెళ్ళాడు. వాటిని తప్పించి తనకని దాచుకొన్నాడు. దేవుడు ఇచ్చిన గొప్ప ఆవరణము, రాజ పదవి, అంతస్తు, గొప్పతనమును యెంచక, గొర్రెలు,ఎద్దులపై ఆశించినందున, తన స్థానాని పోగొట్టుకొన్నాడు.
దేవుని పిల్లలారా, మీకు అద్భుతమైన విమోచకుడు,రక్షకుడు ఉన్నారు. మీకని ఆధ్యాత్మిక గొప్పతనాన్ని, ఉన్నత పదవులను దయచేసియున్నాడు. మహోన్నతుని సకల ఆశీర్వాదాలతో మీరు ఆయనతో నీలచియుంటరా ? యెషయా ప్రవక్త ఇలా అంటాడు, "... మన యందరి దోషమును అతని మీద మోపెను." (యెషయా 53: 6).
మానవజాతి పరిశుధ్దతాను వదలి పాపాలకు గూడు విడచి గూడు మరినందున, మనిషి కోల్పోయిన గొప్పతనాన్ని కీర్తిని విమోచించడానికి ప్రభువు పరలోకము నుండి భూమికి దిగివచ్చాడు. ఆ గొప్పతనాన్ని మరియు కీర్తిని విమోచించి, మరల అతనిని చేర్చుకోనడానికి సిద్ధమై యున్నాడు. దేవుని పిల్లలారా, ప్రభువు ప్రేమలో శాశ్వతంగా నీలచి ఉంటారా?
గుర్తుంచుకో:"మీరు గొఱ్ఱలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు. "(1 పేతురు 2:25 ).