సోమరితనం !

" సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును." (సామెతలు 21:25).

శరీర సోమరితనమైన సరి, ఆత్మ వలన సోమరితనమైన సరి దాని గ్రంధం వ్యతిరేకిస్తుంది. సామెతలు పుస్తకం చదివితే అక్కడ సోమరితనం గురించి చాలా హేచరిక వాక్యమును రాయబడియున్నది చూడవచ్చు. శరీర సోమరితనం అప్పులను తెస్తుంది; ఆత్మ సంబంధమైన సోమరితనం నరకంలో త్రోసి వేస్తుంది.

గ్రంధం ఇలా చెబుతోంది:"మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. ”(మత్తయి 25:30). "అందుచేత- నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము,క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. " (ఎఫెసీ. 5:14).

ఒకసారి, మార్టిన్ లూథర్ తన ప్రసంగములో ఈవిదంగా చెప్పాడు, "క్రైస్తవులను ఎలా నాశనం చేయాలి" అని కలసి ఆలోచించి పిశాసుల సమూ హమును సాతానుడు నడిపించాడు. ఒక పిశాసి " క్రైస్తవులపై అడవి జంతువులను రేపి వారిని చంపుతాను" అన్నది. మరొక పిశాసి"క్రైస్తవులు వేళ్లు ఓడమీద బలమైన గాలి విచేట్లు చేసి వారిని చంపవచ్చు అన్నది. ఈ విధంగా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆలోచన చెప్పింది. చివరికి, ఒక పిశాసి, "మనుష్యులను సోమరివానిగా మార్చి, ఆత్మ రక్షణ గురించి దిగులుపడి నిరుత్సా హపరచి, ఇంకా కాలమున్నది తరువాత మారుమనసు పొందవచ్చు" అని చెబు తాను అన్నది. అప్పుడు సాతాను ఆ పిశా సిని చాలా పొగడి అధికముగా సంతోషిం చాడు.

సోమరితనము కారణముగా అనేక ఆత్మలు పాతాళము వైపు వెళ్లు తున్నవి. లేఖము చెబుతోంది:"ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసిన యెడల ఏలాగు తప్పించుకొందుము? (హెబ్రీయులు 2: 3). సోమరివాడు," అన్నిటిని రేపు చూచుకోవచ్చు తర్వాత చేయవచ్చు" అని చెబుతాడు.

కానీ ఉత్సాహముగా ఉన్నవారో రేపు మన దినము కాదు అని, ఏ దినముది ఆ దినమే చేసి ముగిస్తాడు."ఆసక్తి విషయ ములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి. "(రోమా ​​12:11). అప్పుడే, ఆత్మలను ఆదాయము చేయగలము. సాతాను యొక్క శక్తులను ఎదిరించి నిలబడ గలము.

యేసుక్రీస్తు తలాంతుల గురించి ఒక ఉపమానము చెప్పారు.ఐదు తలాంతులు పొందిన వాడు, మరో ఐదు తలాంతులు సంపాదించాడు. రెండు తలాంతులు పొందిన వాడు, మరో రెండు తలాంతులు సంపాదించాడు. కానీ ఒక తలాంతు పొందినవాడో, ఆ తలాంతును విస్తరింప చేయలేక దానిని భూమిలో దాచాడు. యజమానుడు వచ్చినప్పుడు, అతనుపై కోపపడాడు. సోమరివైన చెడ్డ దాసుడా' అని చెప్పి వాని చేతి నున్న తలాంతులను తీసి పది తలాంతులు గలవానికి ఇచ్చాడు. దేవుని పిల్లలారా, సోమరితనం తొలగించి, చురుకైనవారుగా ఉండండి.

ధ్యానం చేయడానికి: “కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.” (యాకోబు 4:17).