మనిషి యొక్క కీర్తి!
" తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును” (సామె 27:21).
మిమ్మును ఎవరైన పొగడేటప్పుడు ఒక సంతోషం ఏర్పడుతుంది.అదే సమ యంలో పొగడింపునే వెదకి పరుగెత్తు తుంటే అది చివరకు వేదన వచ్చి చేరుతుంది. నేడు మోసపరచే పొగడింపు, ముఖస్తుతియు ఎక్కడకూడ ఎక్కువగా ఉన్నాయి.
రాజకీయ పార్టీలు తమ నాయకులను పొగడి పాడి దాని మూలముగా పార్టీన్ని పెంచుతారు. కొన్ని దినాలతర్వాత చూస్తే, ఎవరిని పైగా పొగడారో వారిని పాతా ళము వరకు తమ వైఖరిని త్రోసి తొక్కి, అసహ్యముగా మాట్లడుతారు. ఈ రోజు పొగడే నోరు రేపు అపవాదు చేయును అనేది మర్చిపోకండి .
ఆధ్యాత్మిక లోకంలో కూడా, అనేకమంది పొగడతలు ఇష్టపడి వారిని ఎక్కువగా ప్రచురము చేసుకొనేది చూద్దాము. వారికి ఆత్మ వరములు, శక్తులు ఉన్నట్లు చూపు తారు. వారిని పొగడి పాడటానికి కొంత మందిని ఏర్పరుస్తారు. వారి ఛాయాచి త్రాలు ఎప్పుడూ పత్రికల్లో వస్తునేయుం డాలని ఇష్టపడుతారు.
ఇందువలన మనుషుల మద్యలో ఒక వేల పేరు, కీర్తి దొరకవచ్చు. కానీ ఆ కీర్తి దేవుని దృష్టిలో అసహ్యమైనది. లేఖనం చెబుతోంది, “కాబట్టి ఒకరి స్వంత కీర్తిని
వెతకడం కీర్తి కాదు. "దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే. ”(సామె.25:27, 28). "మను ష్యులందరు మిమ్మును కొనియాడున ప్పుడు మీకు శ్రమ;" (లూకా 6:26).
యేసుక్రీస్తు వైపు చూడుడి. ఆయన మనిష పొగడతలు అంగీకరించలేదు. తనను పొగడే ప్రజలను అణచి, తనను కాపాడుకున్నాడు. నీకోదేము యేసు వద్దకు వచ్చి, “బోధకుడా, నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడై యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయ నతో చెప్పెను.”(యోహాను 3: 2). అని పొగడి చెప్పిన వెంటనే ఆయన మనసు మారి నీకోదేముకు ఇవ్వవలసిన సల హాలు ఇవ్వకుండా ఉండలేదు.‘ నీకోదేము నీవు మరల జన్మించాలి ’అని యేసు తెలి యజేసాడు.
" ఒక యెవ్వనుడు యేసు దగ్గరకు పరుగెత్తికొనివచ్చి," సత్ బోధకుడా" అని పిలచిన వేంటనే ఆ కీర్తీని ఆయన అంగీ కరించక అతని చూసి, "నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. యేసు- నన్ను సత్పురు షుడని యేల చెప్పుచున్నావు? దేవుడొ క్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. ”(మార్కు 10:17, 18). అని జవాబిచ్చెను.
యేసు కీర్తిలోవున్న ప్రమాదాలను తొల గించడం గురించి తన శిష్యులకు అద్భు తంగా ఉపదేసించాడు. పరిచర్యలో ముందుకుసాగేటప్పుడు ఇతరులు పొగడ వచ్చు, పిశాసులు వెళ్ళేతప్పుడు, దాన్ని చూసి మనసులో అతిసయించవచ్చు. యేసు చెప్పారు.తన శిష్యులకు "మేము నిష్ ప్రయోజకులమైన దాసులము,మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పడనెను.(లూకా 17:10).
దేవుని పిల్లలారా, మీరు మనుష్యుల పొగడింపులో మైమరచి ఆధ్యాత్మిక మహిమను కోల్పోకండి. దేవుని సన్నిధిలో మిమ్మును తగ్గించుకొని పరిశు ద్దతను కాపాడుకొండి. సకల ఘనము, స్తుతి, మహిమయు దేవునికి చెందును.
ధ్యానం చేయడానికి: "తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.” (మాత్తయి 23:12).