గ్రంథం కాంతి!
" ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్ధమైన గద్దింపులు జీవమార్గములు.”(సామెతలు 6:23).
" ఆజ్ఞ దీపము" అని జ్ఞాని తిట్ట వట్టముగ చెప్పాడు. “నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునైయున్నది.” అని దావీదు మంచి తెలివిగా చెప్పాడు. మార్గం తెలియని గొర్రె వలె మీరు అటు ఇటు తిరిగిన్నప్పుడు, గ్రంథం మీకు వెలుగు నిచ్చి మిమ్మల్ని దేవుని మార్గంలో నడిపిస్తుంది.
తీవ్రమైన తుఫానులో చిక్కుకున్న ఒక ఓడను చూడండి. ఎటు చూచిన చీకటి సమయం అది. సముద్రపు అలలు పొంగి ఓడ పైకి మోదు కొంటుఉన్నవి. నశించి పోతుందేమో అని నావికులు భయపడుతున్నారు. తుఫాను తీవ్రతరంగా ఓడను ఇటు అటు విసిరివేస్తుంది. ఏ దిశకు వెళ్లాలని నావికులకు తెలియకుండా తడబడుచున్నారు.
అటువంటి సమయంలో, ఒక దిస నుండి వచ్చే లైట్ హౌస్ వెలుగును ఆ నావికులు చూచినటులైతే,వారి హృదయంలో ఎంత ఆనందం, ఆధరణను అది తీసుకొస్తుంది! చాలా దగ్గరలోనే దరి ఉన్నది! అక్కడనే ఓడను ఉంచినట్లైతే తుఫానునుండి, పొంగడంనుండి తపించుకోవచ్చు అని చెప్పి ఆ వెలుగు దగ్గరకు పోతారుకదా?
చాలా సార్లు, సముద్రం మీ జీవితంలో కూడా తుఫాను వీసుతుంది. సముద్రం పొంగుతుంది. ఏ దిసకు పోవడమనేది తెలియకుండా మీరు తడపడుతున్నారు. ముఖ్యమైన నిర్ణయాలు ఆ సమయంలో మీరు గట్టిగా తీసుకోవలసి ఉంటుంది. దేవుని మార్గం ఏది? దేవుని చిత్తమేంటి? ఏ మార్గంలోవెళ్లితే దేవుని ఆశీర్వాదాలను పొందుకోగలమని మీ మనసు తపిస్తుంది. ఆ సమయంలో దేవుని వాక్యమె మీకు వెలుగు నిస్తుంది.
దేవుని పిల్లలారా,గ్రంథాన్ని తెరచి చదివినప్పుడు 'దేవా, నేను ఏ మార్గలో వెళ్ళాలని నాకు నేర్పండి” అని అడుగుడి. దేవుడు ఖచ్చితంగా తన వాక్యాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని అద్భుతంగా నడిపిస్తాడు. " యోహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును." (కీర్తనలు.19:8).
ఇంగ్లాడు దేశములో రాజు ఒకరు పదవికి వచ్చినప్పుడు, రాజుయొక్క కర్రను ఆయన చేతిలో ఇచ్చి, పరిశుద్ధ గ్రంధమును ఆయనకు కానుకగా ఇచ్చిరి. " మా గణతవహించిన రాజా, ప్రపంచంలో చాలా విలువైన ఈ గ్రంధాన్ని ఇప్పుడు మేము మీకు ఇస్తున్నాము. ఇందులో జ్ఞాణమున్నది,దేవునియొక్క వెలుగున్నది, రాజరీక చట్టమున్నది, ఇదియే దేవునియొక్క మాటలు ఇమ్మిడియున్నవని చెప్పుతారు.
గ్రంధమును పొందుకొన్న తరువాతనే
ఆయన దేశాన్ని పరిపాలించె పదవిని పొందుకొంటారు.
దేవుని పిల్లలారా, గ్రంధం పెద్ద పెద్ద రాజులకును, పేద ప్రజలకును వెలుగునిస్తుంది. విద్య ఉన్నవారికిని, విద్యలేనివారికిని వెలుగునిస్తుంది. ధనవంతులకును, దరిద్రులకును వెలుగునిస్తుంది.దానికి ఏవేరుపాటులేదు.
“ గుర్తించుకో:"నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అవి తెలివి లేనివారికి తెలివి కలిగించును. ” (కీర్తన 19: 8).