యెహోవా- రాఫ!

“ యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.”(కీర్తన 23: 1).

మన దేవుని యొక్క పేరు “యెహోవా” అని పిలువబడుతుంది. యెహోవా అనే పదనికి ఉన్నవాడునై యున్నాను అని అర్థం.ప్రభువు ‘యెహోవా’ అనే పేరుతో కూడా ఇంక చాలా పేర్లతో అని పిలువబడ్డాడు. యెహోవా- హీరే అంటే ‘ప్రభువు యొక్క పర్వతములో చూచు కొనబడును’ అనేది అర్థo అవుతుంది. యెహోవా-షాలోమ్ అంటే ‘ప్రభువు సమాదనము' అని అర్దం. యెహోవా-నిస్సీ అంటే ప్రభువు’ నా జేయమిచ్చువాడు అని అర్ధం. అదేవిధంగా యెహోవా రాఫ అనే పదానికి ‘యెహోవా నా కాపరి’ అనేది అర్థం అవుతుంది.

దావీదు ఒక కాపరి అయినప్పటికీ, ప్రభువే ‘యెహోవా-రాఫ’ అని పిలిచి తనను నడుపుదలనుబట్టి ఆయనను కాపరిగా అంగీకరించెను. దావీదు ప్రేమతో మాటలాడి కీర్తనే 23- వ కీర్తన. ఈ కీర్తన చిన్న కీర్తనగా ఆరు వాక్యములు గలవై ఉన్నపట్టికి చాలా మధురమైన ఒకట గును. గ్రంథంలో ఉన్న ఆధరన భాగాలలో ఇదియు ఒకటగును. ఈ కీర్తన ‘కాపరి యొక్క కీర్తన,’‘ విశ్వాస ప్రమాన కీర్తన’ అని పిలువబడుతుంది.

ఒకరోజు, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని ఇశ్రాయేలు మీద రాజుగా అభి షేకం చేయటానికి యెషయి కుమారుల వైపు వచ్చాడు. దావీదు తప్ప మిగతా కుమారులనందరినీ యెషయి రప్పించి కూర్చునట్లు చేసాడు. కానీ ప్రభువు వారిలో ఎవరినీ ఎన్నుకొనలేదు."నీ కుమా రులు ఇంతమందేనా? వేరు ఎవ్వరు లేరా?" అని సమూయేలు అడిగినప్పుడు వేరు ఒక కుమారుడు ఉన్నాడు. అతను గొర్రెలను కాచుచున్నాడు అని తండ్రి చెప్పాడు.

దావీదు పిలిపించబడి సహోదరుల మద్యలో రాజుగా అభిషేకింపబడ్డాడు. “నా శత్రువులయెదుట నీవు నాకు భోజ నము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచు న్నది" అని దావీదు సంతోషముతో చెప్పడం చూడండి. 23-వ కీర్తనైనది ఒక వేల పాత కీర్తనగావున్నను దానిలోని "యోహోవా నా కాపరి. నాకు లేమి కలుగదు" అనే విశేష ప్రమానమును మీరు ఒక్కొక్కరోజు చేసేటప్పుడు ఆయన మీ కాపరిగావుంటాడు. మీకు ఎప్పుడు లేమి కలుగదు; కొరతగలిగిపోరు.

ఒక మనిషి దేవుని దగ్గర అడిగే అన్ని గొప్ప ఆశీర్వాదాలు ఈ కీర్తనలో అమర్చ బడియున్నవి. విశేషముగా 6-వ వచ నంలో ఈ లోకముకు, నిత్యముకు తగిన సకల ఆశీర్వాదములు ఇమిడి యున్నవి. “నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమ ములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివా సము చేసెదను”. ఇంతకంటే దేవుని దగ్గర అడుగవలసిన వేరు గొప్పకార్యం ఉన్నాదా?

దేవుని పిల్లలారా, మీరు ప్రభువును మీ కాపరిగా అంగీకరించారా? అది నిజమైతే 23-వ కీర్తనలోనున్న అన్ని ఆశీర్వాదాలు మీకు వచ్చిచేరును. మిమ్మును ఆయన ఒక మంచి కాపరిగా నడిపిస్తాడు.

ధ్యానం చేయడానికి: “నేను గొర్రెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొర్రెలకొ రకు తన ప్రాణము పెట్టును. (యోహాను 10:11).