ఇల్లు, గూడు!
" నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను." (కీర్తన 84: 3).
పిచ్చుకలకు ఒక నివాసము, వానకోవెలకు పిల్లలు పెట్టుటకు ఒక గూడు! దేవుని యొక్క ఆలయంలోకి ప్రవేశించిన కీర్తనకర్త ఆలయములోని ఒక్కొక్క బాగము చూచి అకస్మాత్తుగా ఆలయములో ఉన్న పీఠాల వైపు చూశాడు. ఆయనకు ఒకే ఆశ్చర్యము. అక్కడ పిచ్చుకలకు గూడు కట్టియున్నది. వానకోవెల తన పిల్లలను ఉంచియున్నది.
ఈ కీర్తను తర్బీదు చేసిన తర్బీదుదా రులు, దానియొక్క మూల భాషలో, “పిచ్చుకలకు ఒక నివాసము ఉన్నది. వానకోవెలకు తన పిల్లలను పెట్టుటకు ఒక స్థలము ఉన్నది. కాని నా గూడు ఎక్కడ ఉన్నది?” అని అడిగే విధముగా అమర్చ బడిందని ఆలోచన చెప్పుచున్నారు. నా యొక్క గూడు ఎక్కడ ఉన్నది, ఈ లోకములో నాకు గూడు లేదా, నేను అన్యుడును పారదేశినై ఈ లోకములో గడచి వస్తున్నానే, నాకు శాశ్వత నగరం ఇక్కడ లేదా అని చాలా సందర్భములో మనము చింతించుచున్నాము. యేసు చెప్పాడు, "అందుకు యేసు- నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసము లును కలవు గాని మనుష్యుకుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.”(లూకా 9:58).
దేవుని యొక్క కారుణ్యం పిచ్చుకకు గూడు కలుగజేస్తుంది. ఇది రెండు కాసు లకు ఒక పిచ్చుక అని అమ్మబడుతున్న చౌకైన పక్షి. మనిషియొక్క ఆశ్రయంను వెదకి పరుగెత్తి వచ్చేచిన్న పక్షి. కానీ దేవుడు దానిని ప్రేమించి తన పీఠాలదగ్గర దానికి స్థలము నిచ్చాడు.
ఇల్లు, గూడు అనే పదాన్ని ఆలోచించి చూడుడి. గూడు శాశ్వతమైనది కాదు; కాని ఇల్లు స్థిరమైనది. గూటిలో చిన్నపి ల్లలు జీవిస్తున్నవి అవి పెరిగిన తర్వాత గూటినివదిలి ఎగిరిపోతున్నవి. మీరును ఇహలోక జీవితాన్ని గూటిలోనే జీవిస్తు న్నారు. మీకు భార్య, పిల్లలు ఉన్నారు. ఇది గూడుగదా దాగడానికి ఇల్లు కాదు. ఇల్లు అనే నిత్యమైన నివాసమును మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అది పరలోక నివాసం; అది దేవుని నివాసం; అదియే నిత్య నివాసములు. మీరు భూలోకపు గూటిలో జీవించేటప్పుడు, జీవితకాల మంత కృపాక్షేమములే మీ వెంటవస్తు న్నవి. ఈ గూటినివిడిచి వెల్లెటప్పుడు చిర కాలము యెహోవా మందిరంలో నివసిం చెదరు.
ఒకరికి సువార్తను ప్రకటించేటప్పుడు, “ఈ రోజు నీవు చనిపోతే నిత్యమును నీవు ఎక్కడ గడుపుతావు?” అనే అడుగు చున్నాము. ఈ ప్రశ్న మనిషిని ఆలోచింప జేస్తుంది, మీకు ఒక నిత్యనివాసము కావలియునని అనుకునేలా చేస్తుంది. దేవుని పిల్లలారా, మీకు ఒక నమ్మకము యున్నది. ఒక నిజమున్నది. లేఖనం చెబుతుంది, భూమిమీద మన గుడార మైన ఈ నివాసము సిథిలమైపోయినను, చేతి పనికాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోక మందు మనకున్నదని ఎరుగుదుము. ” (II కొరింథీయులు 5 : 1).
ధ్యానం చేయడానికి: “నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధప రచ వెళ్లుచున్నాను.”(యోహాను 14: 2).