పుష్ఠినొందుదురు!

"ఔదార్యముగలవారు పుష్ఠినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును" ( సామె : 11:25)

మీరు ఆధ్యాత్మికంగా, లోకానుసారముగ ఆశీర్వదించబడాలంటే,మీకు ధారాళమైన గుణము అవసరము. దేవుడు ధారాళగుణము గలవాడు గదా? కాబట్టి, దేవుడు ధారాలగుణముగల ఆత్మలను వృద్ధి చేస్తాడు.

దేవుడు మీ కొరకు లోకాన్ని, అందు లోనివన్ని సృష్టించాడు. మీరు శ్వాసించడానికి మంచి గాలిని, త్రాగడానికి మంచి నీటిని, మంచి ఆహారమును ఇచ్చాడు. మృగరాసులను, పక్షులను ఇచ్చాడు. పరిపాలనను, అధికారమును ఇచ్చాడు. కల్వారి సిలువలో తనను తాను ఇచ్చాడు. నిత్యరాజ్యంలో వాసస్థలమును ఇస్తాడు. ఆయన ఎంతటి
దారాళగుణముగలవాడు! ఆయనకు మీరు ఏమి ఇవ్వవలెను? అవును, మీ పూర్ణహృదయాన్ని ఆయనకు ఇవ్వాలి. మీ జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. మీయొక్క సమయమును, ప్రయత్నములను, తలాంతులను అన్నిటిని ఆయనకొరకు సంతోషంగా ఇవ్వాలి. అది ఎంత గొప్ప ఆశీర్వాదం!

"ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్ధించుచున్నాను." (III యోహాను 1: 2). అని గ్రంధం చెబుతుంది.

మీరు అన్ని విషయాలలో జీవించి సుఖకముగా ఉండవలెను అనునది ప్రియమైన పరమ తండ్రి యొక్క వాంచయు కోరికయైయున్నది. ఆయన మహోన్నతమైన సకల ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆత్మ వరములను ఫలాలను దయచేయుచున్నాడు. ఆయన మీకు ఇచ్చినట్లు మీరు ఇతరులకు ఇచ్చినట్లైతే ఇంక అదికముగా ఫలించెదరు."ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును" (లూకా 6:38) అని గ్రంథం చెబుతోంది.

మీరు దేవునికి ఇచ్చినట్లైతే, ఉర్సహముగా, మనపూర్వకముగ సంతోషముగా ఇవ్వనందువలన దేవుని యొక్క ఆశీర్వాదాలను పూర్తిగా అనుభవించ లేకయున్నరు.గ్రంధం చెబుతోంది, "తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.” (సామెతలు 11:24). పిసిని తనం ఎదుటి వారికి పేదరికం తప్ప మరేమీ తీసుకురావు.

మీ బంధువులు ఎంతోమంది పేదరికంలో ఉండవచ్చు. మీ సంఘంలో దీనస్థితిలో వేదనపడె కొంతమంది విశ్వాసులను మీరు చూచిఉండవచ్చు. మీకు వీలైనంత వరకు వారికి దారాళముగా ఇవ్వండి. లేఖనం చెబుతోంది: “ఎవడైనను స్వకీయులను,విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (I తిమోతి 5: 8).

దేవుని పిల్లలారా, దేవుని సువార్త ప్రబలడటానికి, ప్రజలు రక్షింపబడటానికి దేవునికొరకు ఇవ్వడం ఎంత భాగ్యమైన అనుభవం! మీరు దేవునికొరకు ఇచ్చినప్పుడు దేవుడు వెయ్యంతలు అది తిరిగి ఇస్తాడు. ఆకాశపు వాకిండ్లను తెరువచేస్తాడు.

గుర్తించుకో:"మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పచున్నాను. ” (మాథ్యూ 10:42).