జింక కాళ్లు !

"ఆయన నాకాళ్లు జింక కళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు." (కీర్తన 18:33).

జింక యొక్క కాళ్లు వేగముగా పరుగెత్తే బలముగలవి. అదే సమయములో జింక కాళ్లు ఎగిరి దుముకి కొండలపై ఎక్కేటటు వంటివిగా ఉన్నవి. ఎవరు ఎక్కి రాలేని ఎత్తెన మెట్టలపై జింకలు అందముగా ఎగిరి దుముకుతు ఎక్కి గంభీరముగా నిలబడతాయి.

గ్రంథంలో మూడు చోట్లలో "ఆయన నా కాళ్లు జింక కాళ్లవలె చేయును అనే వాక్య మును చదవచ్చు (II సమూ 22:34, కీర్తన 18:33, హబక్కుక్ 3:19). ఈ మూడు వచనములలో జింక కాళ్లు ఎత్తైన స్థలాలో నిలబడటం మీరు చూడవచ్చు. క్రీస్తనే బండపై మీరు నిలకడగా నిలబడటానికి జింక కాళ్లు మీకు కావలెను.

జింక కాళ్లుగా ఉండవలసిన కొంతమంది కాళ్లు ఈ రోజు ఏనుగుల కాళ్లవలె ఉంటు న్నవి. ఎందుకు ఇలా అయినది? ఏనుగు కాళ్లు అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధి దోమ కరవటం వల్ల ఒక శరీరం నుండి ఇంకొకరి శరీరంలోకి వెల్లే క్రిముల ద్వారా వ్యాపి స్తాయి. కంటికీ కనబడని చాలా చిన్న క్రిములు దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.

ఈ వ్యాది ఉత్పత్తి అయినది వీరికి తెలియలేదు. కాని మూడు నుండి ఐదు సంవత్సరాల తరువాత కాళ్లలో చేతు లలో వాపు ఏర్పడి జ్వరం వచ్చినప్పుడే ఈ వ్యాదిని తెలుసుకోగలుగును. చివరికి, గుణపరచలేని ఆకరిస్థితికి చేరుతుంది. కాళ్లు ఏనుగు కాళ్లవలే చీము కారుతుంది.

చూడండి! చిన్న దోమ ఎంత గొప్ప హింస చేస్తుంది. దోమను కొట్టితే అట్లే నలిగి చని పోయేటటువంటి చాలా బలహీనమైన ఒక జంతువే. కానీ దోమ కాటును మీరు లెక్కచేయనప్పుడు, జీవితమంత ఎంత వేదనను అనుభవించవలసియున్నది!

అదేవిధంగా చిన్న చిన్న పాపాలే గదా అని మీరు నిర్లక్ష్యయముగాయున్నప్పుడు అది మీలోనికి వచ్చి బలపడడానికి ప్రారంభిస్తుంది. ఆత్మ కూడా వ్యాదితో నిండుతుంది. చివరికి, “పాపం చేసే ఆత్మ చనిపోవును” అనే వాక్యము ద్వారా చనిపోతుంది.

జింక కాళ్లుగా ఉండవలసిన మీ కాళ్లు ఏనుగు కాళ్లవలే మారుతు వస్తున్నవా? తగినపరిశోదన చేయటానికి ఇదియే మంచి సమయం.పాపమనే ఏనుగు కాళ్ల వ్యాధి గుణపడాలంటే దానికి ఒకే వైద్యు డు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనయొక్క రక్తమే సకల పాపక్రిములను తొలగించి మిమ్మును శుద్దీకరించును.

పోతీఫరు యొక్క భార్య యోసేపుకు ఏనుగు కాళ్ల వ్యాదిని ఇయ్యడానికి ఆయ త్తముగాయున్నది. కానీ అతనో 'వేసితన మునకు తొలగి పరుగెత్తుడి' అనే మాట ప్రకారం తన కాళ్లను జింక కాళ్లుగా చేసు కొని తన వస్త్రము పోయిన పరవాలేదని పరుగెత్తుకొనిపోయాడు.దేవుని పిల్లలారా, ప్రతిరోజూ దేవుని సన్నిధిలో మిమ్మును పరిశోదించి చూడుడి. పాపపు దోమ మీ మీద కూర్చోవడానికి చోటియ్యకండి.

ధ్యానంచేయడానికి: "దేవా,నీవు మరణ ములోనుండి నా ప్రాణమును తప్పించి యున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించియున్నావు."(కీర్తన 56:12).