అసూయవలన….!

"సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు. ” (సామెతలు 14:30).

మత్సరము ఎముకలకు కుళ్లు గ్రంథం చెబుతుంది (సామెతలు 14:30), బుద్దిలేనివారు అసూయవలన చచ్చెదరు." (యోబు 5: 2). గ్రంధం చెబుతోంది. కాబట్టి, అసూయకు మిమ్మును దూరముగా కాచుకొనుడి.

కొరియాలో దేశములో చాలా సంఘాలు ప్రారంబించబడి యున్నవి. అవి ఒకదాని కొక్కటి అసూయపడి పోటిపడుతు వున్నవి. ఒక సంఘము ‘ఉపవాస కొండ సేవ ప్రారంభిస్తే అన్ని సంఘాలు ఉపవాస కొండ సేవ ప్రారంబించటానికి ఒకదానితో ఒకటి పోటీపడుతు ప్రయత్నిస్తున్నవి. ఒక సంఘముయొక్క కట్టడము పెద్దదిగా వున్నది చూసి, మిగతా సంఘాలు దానికంటే పెద్ద సంఘముగా కట్టడానికి ప్రయత్నిoచి తీరని ఆర్థిక ఇబ్బంధిలో చిక్కుకుంటారు. ఒక సంఘము యొక్క విశ్వాసులు ఇతర సంఘమునకు చెందిన విశ్వాసులను అసూయతో నింధిస్తునారు. అందువలన, అనేక భేదాభిప్రాయాలు వస్తున్నాయి.

కొంతమంది "ఇది మంచిదే కదా! ఆరోగ్యమైన పోటీయెకదా! "అని వాదించవచ్చు. కానీ ఇది నిజముగా చూస్తే ఆపదైనది. సేవకులు, సంఘాలు ఒకరికొక్కరు చేతులు కలిపి, ఒకరికొక్కరు ఏక మనసుకలిగి సువార్తను ప్రకటించాలే తప్ప, అసూయతో పోటీ పడకూడదు.

గ్రంధములో మొట్ట మొదటగా అసూయతో పోటీపడినవాడు సాతానే. అతడు దేవునితో పోటీ పడెను. "నేను ఆకాశమున కెక్కి పోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును.”(యెషయా 14:13, 14) అని చెప్పాడు. ఈ కారణంగా వాడు పరలోకమునుండి క్రింద త్రోయబడ్డడు. అగాల పాతళములో పడిపోయాడు.

రెండవది, అసూయకు తనను తాను అమ్ముకున్నవాడు కయీనే. (ఆది.4: 8). అతని అర్పణ అంగీకరించక హేబేలు యొక్క అర్పణను అంగీకరించబడటం వలన అసూయ వచ్చింది. దానితో కోపము, హత్యాచారము వచ్చింది. ఆకరగా సొంత సహోదడినే హత్య చేసాడు. అసూయకు చోటియ్యకండి.

దేవుడు ప్రతి వ్యక్తిని ఒక్కొక్క పరిస్థితులో ఒక్కొక్క విధముగా ఉంచుతాడు. కాబట్టి, ధనవంతులను చూసో,కీర్తి పొందినవారిని చూసో లేక మీకు పైగా సేవ చేసేవారిని చూసో అసూయపడకండి. అసూయ ఎముకలకు కుళ్లు, దాని విలువ ఒకని సొంత ఎముకను అరగుతుందని మరచిపోకండి.

అనేకమంది తమ పిల్లలదగ్గర, పక్క ఇంటి బిడ్డ ఎంత మంచిగా తింట్టుంది, ఎదురింటి బిడ్డ ఎంత మంచిగా చదువుతుంది, నీవు చదవాలి కదా అని మిగతా పిల్లలతో పోల్చి. పిల్లల హృద యంలో అసూయను విత్తుతారు. దేవుని పిల్లలారా, మీ యొక్క పిల్లలు మిగతా పిల్లలతో పోటీచేసి అసూయతో ముందుకు పోడానికి ప్రోత్సహపరచకండి. అది పిల్లల భవిష్యత్తును ఎక్కువ బాదిస్తుంది.

ధ్యానం చేయడానికి: “చెడ్డవారిని చూచి వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. ” (కీర్తన 37: 1).