మౌనముగా నుండుట !
నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను. కీర్తనలు 39 :2
మౌనముగా నుండుటకు మాటలాడుటకు ప్రతిదానికి సమయము కలదు. ప్రసంగి 3 :7
మౌనముగానుండుట అగత్యమైనప్పుడు మౌనముగా ఉండుట మంచిది.
కొన్ని కాథోలిక దేవాలయాలలో మఠాలు "నిశబ్ద సాధువు మఠాలు" ఉన్నాయి వాటినే ది మట్ అఫ్ సైలెంట్ సెయింట్స్ అని అంటారు. అక్కడి సాధువులు ఎవరితోనూ మాట్లాడక మౌనముగా ఉంటారు.
ఇజ్రాయెలో- ఏలీయా దాగి ఉన్న కెరెతు వాగునొద్ద ఒక మఠం మున్నది. అక్కడ ఉండే కొందరు సాధువులు మౌనముగా నుండుట ఒక సంప్రదాయంగా ఆచరిస్తారు. కొన్ని నెలలువరకు కూడా మౌనమును పాటిస్తారు. ఏలీయా అక్కడ దాకున్నపుడు ఎలాగూ మౌనముగా ఉన్నాడో దానిని సూచిస్తూ వారు కూడా మౌనముగా ఉంది అదే పద్దతిగా అనుసరిస్తారు.
పాత నిబంధనలో- వారి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తమునొందగోరి వారు గొనె పట్టను కట్టుకొని మౌనముగా ఉంది వారి నెత్తిమీద బూడిదను చల్లుకొని ఆ దినమును వారు ప్రక్షాళన దినముగా ఆచరించేవారు.
సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు తలలమీద బుగ్గి పోసికొందురు గోనెపట్ట కట్టు కొందురు యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచు కొందురు. విలాప 2 :10
వారీలాగు చేయుట దేవుడు చూచి వారి కన్నీటిని నాట్యముగా మార్చెను. వారి బంధకములనుండి విడిపించెను. దావీదు తన జీవితములో మౌనముగానుడుటకు దినమును ఎంచుకొని ఆ దినమున దేవుని వాక్యమును ధ్యానించేవాడు. ఆ సమయము లోకపు స్వరమును వినకుండునట్లు దేవుని స్వరమును వినునట్లు తన హృదయమును తెరువబడెను.నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని. కీర్తన 39 :3
ఈ లోకములోని ప్రజలు నిరంతరము మాట్లాడుటవలనే పనులను చేస్తుంటారు. తమ వస్తువులను అమ్ముటకు ఉత్తమ లక్షణాలను హైలైట్ చేసి వాటిని ప్రచారం చేస్తుంటారు. నేడు మనుషులే కాదు రేడియో, టీవీ , రికార్డు ప్లేయర్స్ కూడా మాట్లాడుతున్నాయి. అనేకమైన మాటలు అనేకరకాలుగా మన చెవిలో మారుమ్రోగుతూనే ఉంటాయి.ఇవన్నీ ప్రతి మానవుని జీవితమును వారి సౌలభ్యము కొరకే ఆలోచించేలా మార్చివేస్తాయి. దీనివల్ల దేవుని స్వరమును ఆలకించే అవకాశాన్ని కోల్పోచేస్తుంది.
ప్రియమైన దైవ జనంగామా దేవుని స్వరమును వినునట్లు కొంత సమయం మౌనముగానుండుడి. మీరు దేవుని సన్నిధిలో గడుపు సమయము మీకు ఆశీర్వాదమును తెస్తుంది.
అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. హబక్కూకు 2:20